బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (16:26 IST)

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

Pawan kalyan-Nadendla
Pawan kalyan-Nadendla
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో అక్రమంగా రైస్ స్మగ్లింగ్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. కాకినాడ వెళ్లిన ఆయన స్మగ్లింగ్ చేస్తూండగా పట్టుకున్న శాంపిల్స్‌ను పరిశీలించారు. పవన్ కాకినాడకు వెళ్లి ఈ స్మగ్లింగ్ ఎందుకు ఆగడం లేదో పరిశీలించాలని నిర్ణయించారు. 
 
లోకల్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన వనమాడి వెంకటేశ్వరరావు ఉన్నారు. పోర్టులోకి రైస్‌ ఎలా వస్తుందని ఎమ్మెల్యేను పవన్ ప్రశ్నించారు. మీరు సరిగా ఉంటే రైస్‌ ఎలా వస్తుందని..  మీరు కూడా కాంప్రమైజ్‌ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది అని ప్రశ్నించారు. పోర్టు అధికారులపైనా మండిపడ్డారు. 
 
ఈ రైస్‌ను ఎగుమతి చేసేందుకు .. పోర్టులో ఎక్కించేందుకు అంగీకరించిన అధికారుల పేర్లు  రాసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. తర్వాత పవన్ సముద్రంలో రైస్ స్మగ్లింగ్ చేస్తున్న షిప్ వద్దకు ప్రత్యేక బోటులో వెళ్లి పరిశీలన జరిపారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా..? ఇంత రైస్ పోర్టులోకి ఎలా వస్తుంది..? ఇలా ఉంటే ఎలాంటి పేలుడు పదార్థాలు అయినా లోపలికి రావొచ్చు కదా.. అంత ఈజీగా ఎలా తీసుకుంటారు. ఇంత నిర్లక్ష్యం వల్లే కదా కసాబు వాళ్లొచ్చింది. కస్టమ్స్ పోలీసులేంటి? కలెక్టర్ షాన్ మోహన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇలా ఎందుకు జరుగుతుందో అడగండి.. ఎస్పీ గారిని కూడా ఎక్స్‌ప్లనాటరీ నోట్ పంపించమని చెప్పండి.. అంటూ సీరియస్ అయ్యారు.
 
గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధానంగా ఈ బియ్యం స్మగ్లింగ్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పవన్ కల్యాణ్‌ కాకినాడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ద్వారంపూడి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని బయట పెట్టి జైలుకు పంపిస్తామని చాలెంజ్  చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే పనిలో ఉన్నారు. 
 
ఆఫ్రికా దేశాలకు పంపుతున్న బియ్యం.. ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. పవన్ స్వయంగా కాకినాడ పోర్టుకు వచ్చి పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించడం హాట్ టాపిక్‌గా మారింది.