బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (15:07 IST)

ఫలించిన పవన్ ఢిల్లీ పర్యటన- పవన్ రావాలి.. పాలన మారాలి (వీడియో)

Pawan kalyan
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రత్యేక సాయం విడుదల చేసింది. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ (SASCI) కింద తొలివిడత నిధులు విడుదల చేసింది. సాస్కి పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.113.75 కోట్లు విడుదల చేసింది. 
 
ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఫలించింది. అలాగే అఖండ గోదావరి, గండి కోట ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు 172.34 కోట్లను కేంద్రం కేటాయించింది. 
 
మొదటి విడతగా రూ.114 కోట్లు విడుదల చేసింది. ఏపీలో టెంపుల్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.