శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (15:19 IST)

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

Pawan_Botsa
Pawan_Botsa
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్‌తో వైకాపా నేత బొత్స సత్యనారాయణ చేతులు కలిపారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి వచ్చినప్పుడు భవనం బయట వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 
 
పవన్‌ను పలకరిస్తే జగన్‌కు ఎక్కడ కోపం వస్తుందో అని పెద్దిరెడ్డి పక్కకు వెళ్లిపోతే బొత్స మాత్రం.. నవ్వుతూ వెళ్లి చేతులు కలిపారు. ఇంకా ఎదురుగా నిలబడి పవన్ కళ్యాణ్‌కు నమస్కారం పెట్టారు. 
 
పవన్‌ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ఆపై పవన్ కళ్యాణ్ కారులో వెళ్లిపోగా.. బొత్స అసెంబ్లీ లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దృశ్యం జగన్‌కు చాలా కాలం గుర్తుంటుందని అసెంబ్లీలో సెటైర్లు వినిపించాయి.