గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (11:49 IST)

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

Nagababu
మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై నాగబాబు స్పందించారు. "అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమే, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లిన పరమార్థం స్వార్థ ప్రయోజనాలకోసం కాదు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. (అలాంటి నాయకుడి కోసం నా లైఫ్‌ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. I dont have any political ambitions other than  to serve my leader.) అంటూ ట్వీట్ చేశారు. ఇపుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై జనసైనికులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.