శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (09:43 IST)

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

buchibabu sana
'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సాన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇది రామ్ చరణ్ నటించే 16వ చిత్రం. ఈ చిత్రం గురించి దర్శకుడు బుచ్చిబాబు సాన కీలక అప్డే ఇచ్చారు. కర్నాటక రాష్ట్రంలోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. 
 
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మైసూరులో చాముండేశ్వరి మాత ఆశీస్సులతో షూటింగును ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అందరి ఆశీస్సులు కావాలంటూ చాముండేశ్వరి మాత ఆలయం ముందు దిగిన ఫొటోను ఆయన 'ఎక్స్' ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
 
ఇక్కడ చెర్రీతో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం. ఇక ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా 'ఆర్సీ16' చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహహాన్ బాణీలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో దీనిని నిర్మిస్తోంది. ఇదిలాఉంటే.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.