సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (14:41 IST)

విజయనగరం జిల్లాలో వైకాపాకు షాక్ : డిప్యూటీ సీఎం మామ రాజీనామా

విజయనగరం జిల్లాలో వైకాపాకు షాక్ తగిలింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 
 
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.. త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో శత్రుచర్ల రాజీనామా చేయడం వైసీపీకి షాకేనని తెలుస్తోంది. 
 
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు వలనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శత్రుచర్ల ప్రకటించారు. కార్యకర్తల సమావేశం తర్వాత ఏ పార్టీలో చేరుతానన్నది ప్రకటిస్తానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అదే జరిగితే వైసీపీతో పాటు డిప్యూటీ సీఎంకు కూడా పెద్ద షాకేనని ఆయన అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు.