శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 4 జులై 2018 (22:01 IST)

బాలికలు అలాంటి రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలి... పాఠశాల యాజమాన్యం

మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ విద్యా సంస్థ పెట్టిన నిబంధన ఇప్పుడు షాకింగుకు గురి చేస్తోంది. గతంలో విద్యార్థుల వస్త్రధారణ... అంటే జీన్స్, టీషర్టులు వగైరాలపై ఆంక్షలు విధించిన పాఠశాలల గురించి విన్నాం. కానీ తాజాగా పూణెలోని విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సం

మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ విద్యా సంస్థ పెట్టిన నిబంధన ఇప్పుడు షాకింగుకు గురి చేస్తోంది. గతంలో విద్యార్థుల వస్త్రధారణ... అంటే జీన్స్, టీషర్టులు వగైరాలపై ఆంక్షలు విధించిన పాఠశాలల గురించి విన్నాం. కానీ తాజాగా పూణెలోని విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సంస్థ ఉత్తర్వులు జారీ చేసి సంచలనానికి తెరలేపింది. 
 
ఏటా విద్యార్థులకు ఇచ్చే డైరీల్లో ఈ ఏడాది పెట్టిన నిబంధనలు చూసి విద్యార్థునులు షాకయ్యారు. అందులో ఏమున్నదంటే... బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ నిబంధన చూసిన విద్యార్థునుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఇదంతా కేవలం బాలికల భద్రత కోసమేనంటూ సదరు విద్యా సంస్థ సంభాళించుకుంటోంది. కానీ ఈ నిబంధన తీసివేయాలంటూ బాలికల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేశారు.