శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (20:27 IST)

రాష్ట్రపతితో ఏపీ గవర్నర్ భేటీ.. ముగిసిన బిశ్వభూషణ్ ఢిల్లీ టూర్

Biswa Bhusan Harichandan
Biswa Bhusan Harichandan
ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సోమవారం గవర్నర్ రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ భేటీ సందర్భంగా ఏపీలోని తాజా ప‌రిస్థితుల‌ను రాష్ట్రప‌తికి గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. 
 
సోమ‌వారం నాటి రాష్ట్రప‌తి భేటీతో గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ టూర్ ముగిసింది. మంగ‌ళ‌వారం గ‌వ‌ర్న‌ర్ తిరిగి విజ‌య‌వాడ బ‌య‌లుదేర‌తారు.
 
కాగా.. శనివారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌, త‌న ఢిల్లీ టూర్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో కూడా భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.