Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిలోంచి పాములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. 20..!

Written By సెల్వి
Updated: గురువారం, 4 మార్చి 2021 (16:30 IST)
భూమిలోంచి పాములు వెలికి వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20కి పైగా పాము పిల్లలు భూమిలోంచి బయటకు వచ్చాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపురంలో రోడ్డుపక్కన మిషన్ భగీరథ కోసం గొయ్యి తీసి పూడ్చివేశారు. అందులోనే పాము గుడ్లను పెట్టింది. 
 
మొదట ఈ గొయ్యి నుంచి పాము పిల్ల బయటకు వచ్చింది. స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఒకదాని వెనుక ఒకటి ఇలా 20కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. అయితే ఈ పాము పిల్లలను చంపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిసరాల్లోకి వెళ్లిపోయాయి. 
 
ఆ తర్వాత గొయ్యిని తవ్విన స్థానికులకు అందులో మరిన్ని పాము గుడ్లు కనిపించాయి. వాటిని ధ్వంసం చేసి గొయ్యిని పూడ్చివేశారు. అయితే తప్పించుకున్న పాములు ఇళ్లల్లోకి వచ్చి కాటేస్తాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

అన్నీ చూడండి

ఆర్‌. మాధవన్‌ నటించిన జి.డి.నాయుడు విడుదలకు సిద్ధం

నటి టబుకు సంబంధించిన అభ్యంతరకర ఆన్‌లైన్ కంటెంట్‌ను తొలగించాలి.. కోర్టు

Fauji Latest Update: ఫౌజీ కోసం బ్రిటీషర్లతో పోరాడే యోధునిగా ప్రభాస్ పై యాక్షన్ సీన్స్

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments