1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:06 IST)

పసిఫిక్‌‌లో బలమైన భూకంపం.. సునామీ హెచ్చరికలు

tsunami
పసిఫిక్‌‌లోని లాయల్టీ దీవులకు ఆగ్నేయంగా బలమైన భూకంపం సంభవించింది. దీనితో సునామీ హెచ్చరికలు విడుదలయ్యాయి. తీర ప్రాంతాలను కాళీ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేసారు.
 
న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రజలు అహిపారా నుండి బే ఆఫ్ ఐలాండ్స్, గ్రేట్ బారియర్ ఐలాండ్, మాటాటా నుండి తోలాగా బే వరకు ఉన్న ప్రాంతాలలో ప్రజలు బీచ్ లకు దూరంగా ఉండాలని కోరారు.
 
న్యూజిలాండ్ తీరప్రాంతాలు తీరంలో బలమైన మరియు అసాధారణమైన ప్రవాహాలు ఉన్నాయని, అనూహ్య ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నామని' అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతలో, ఆఫ్‌షోర్ ఆస్ట్రేలియా ద్వీపాలు, భూభాగాలకు సునామీ ముప్పు ఉందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటిరాలజీ తెలిపింది.
 
యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఇఎంఎస్సి) చేసిన ప్రకటన ప్రకారం 7.7గా సంబంధించిందని వెల్లడించారు. భూకంపం, అంతకుముందు 7.2 తీవ్రతతో వచ్చినట్టుగా పేర్కొన్నారు. 
 
కేవలం ఒక గంట వ్యవధిలో 5.7 నుండి 6.1 వరకు తీవ్రతతో వచ్చాయి. వనాటు, ఫిజి, న్యూజిలాండ్ సహా ఇతర ప్రాంతాలలో సునామీ సంభవించే అవకాశం ఉందని యుఎస్ సునామి హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.