1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (21:31 IST)

చమ్మక్ చంద్రకు వార్నింగ్ ఇచ్చిన నాగబాబు, ఏమైంది? (Video)

జబర్దస్త్ షో సృష్టించిన రికార్డ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎనిమిదేళ్ళ పాటు నిర్విరామంగా సాగుతూ అందరినీ అలరించింది. అలరిస్తోంది. ఆ షో అంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుని పోయి కూర్చునే వాళ్ళు చాలామందే ఉన్నారు.
 
ఈ షోకు మొదట్లో ప్రత్యేక ఆకర్షణ నాగబాబు. అయితే ఆయన చివరకు ఆ షో నుంచి బయటకు రావడంత మాత్రం పెద్ద చర్చకే దారితీసింది. ఆ తరువాత మరో టీవీషోలో బొమ్మ అదిరింది అంటూ వెళ్ళారు. ఆయనతో పాటు కొంతమంది ఆర్టిస్టులను వెంటేసుకుని మరీ వెళ్ళారు.
 
అందులో ప్రథముడు చమ్మక్ చంద్ర. అయితే ప్రస్తుతం చమ్మక్ చంద్ర ఆలోచనలో పడిపోయాడట. అందుకు కారణం గత వారం టీవీ షో బొమ్మ అదిరింది రాకపోవడం.. ఈ వారం కూడా వస్తుందో లేదోనన్న అనుమానం కలగడం. దాంతో పాటు కొన్నిరోజులు చమ్మక్ చంద్ర షోకు దూరంగా ఉంటున్నారట.
 
దీంతో తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కావడం కాలేదట చమ్మక్ చంద్ర. జబర్దస్త్ షోలో ఉన్నా హాయిగా అక్కడే ఉండివుండేవాడనని.. నాగబాబును నమ్ముకుని వచ్చినందుకు బాగా శాస్తి జరిగిందంటూ బహిరంగంగా చెప్పేస్తున్నాడట చమ్మక్ చంద్ర. ఇది కాస్త నాగబాబుకు కోపం తెప్పించిందట.
 
దీంతో నాగబాబు చమ్మక్ చంద్రకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట. నీకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడు. అంతేగానీ... ఇలా ఎందుకు విమర్సిస్తూ కూర్చుంటున్నావు అంటూ మండిపడ్డారట నాగబాబు.