శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జులై 2023 (10:55 IST)

ఆంధ్రా యువకుడిని వివాహం చేసుకున్న శ్రీలంక యువతి

Love
ఫేస్‌బుక్‌లో పరిచయమైన భారతీయుడిని ఓ శ్రీలంక యువతి వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విఘ్నేశ్వరి శివకుమార అనే 25 ఏళ్ల శ్రీలంక యువతి టూరిస్ట్ వీసాపై ఆ దేశానికి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన తన 28 ఏళ్ల ప్రియుడు లక్ష్మణ్‌ను ఆంధ్రాలోని వెంకటగిరికోట పట్టణంలో పెళ్లి చేసుకుంది.
 
అయితే ఆమె వీసా గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియగా.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల మేరకు చిత్తూరు జిల్లా పోలీసులు విఘ్నేశ్వరికి నోటీసు జారీ చేశారు. ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.