సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (09:41 IST)

రెండో వన్డేలో చిత్తుగా ఓడిపోయిన భారత్.. ఆగస్టు 1న తుదిపోరు

indis vs west indies
ఆతిథ్య వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్‌లో కరేబియన్ కుర్రోళ్ళు ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. దీంతో మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 1-1తో సమం చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఆగస్టు ఒకటో తేదీన జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్ళలో ఇషాన్ కిషన్ 55, గిల్ 34 చొప్పున చెప్పుకోదగిన పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్ళు పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విడీస్ బ్యాటర్లలో షై హోప్ 63, కార్టీ 48, కైల్ మేయర్స్ 36 చొప్పున పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ చొప్పున తీశాడు.