మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (12:02 IST)

విశాఖ వేదికగా భారత్ - ఆసీస్ వన్డే మ్యాచ్ : టిక్కెట్ల కోసం బారులు

Visaka
Visaka
విశాఖపట్టణం వేదికగా ఈ నెల 19వ తేదీన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‍‌ కోసం ఇప్పటి నుంచే టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఆన్‌లైన్‌లో ఈ నెల 10 నుంచే అందుబాటులో ఉంచగా.. ఆఫ్‌లైన్‌లో నేటి నుంచి విక్రయిస్తున్నారు.
 
విశాఖ నగరంలోని పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం-బి మైదానం, జీవీఎంసీ మున్సిపల్‌ స్టేడియం, రాజీవ్‌గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. టికెట్‌ కౌంటర్ల వద్ద వేకువజాము నుంచే క్రికెట్‌ అభిమానులు బారులు తీరారు. 
 
టికెట్ల కోసం పలువురు మహిళలలు చంటి పిల్లలతోనూ విక్రయ కేంద్రాల వద్దకు వచ్చారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఈ వన్డే మ్యాచ్ కోసం విశాఖ జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.