సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (09:47 IST)

ఆస్కార్ 2023: ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా ది ఎలిఫెంట్ విస్పరర్స్

The Elephant Whisperers
The Elephant Whisperers
95వ అకాడమీ అవార్డ్స్‌లో, కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన, గునీత్ మోంగా నిర్మించిన డాక్యుమెంటరీ లఘు చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా అవార్డు పొందింది. 
 
ఈ చిత్రం హాలౌట్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్, హౌ డు యు మెజర్ ఎ ఇయర్‌తో సహా మరో నలుగురు నామినీలతో పోటీపడింది. 
 
1969, 1979లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌గా పోటీ పడిన ది హౌస్ దట్ ఆనంద బిల్ట్, యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్ అనే రెండు మునుపటి భారతీయ చిత్రాలు మాత్రమే ఇంతకుముందు నామినేట్ అయ్యాయి, ఈ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్.