మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (08:09 IST)

భారత్‌కు ఆస్కార్ అవార్డు - దక్కించుకున్న "ది ఎలిఫెంట్ విష్పరర్స్‌"

Guneet Kapoor
భారత్‌కు మరో ఆస్కార్ అవార్డు వచ్చింది. 2023 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో "ది ఎలిఫెంట్ విష్పరర్స్‌" ఈ అవార్డును సొంతం చేసుకుంది. కార్తీక్, గునీత్‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబైకు చెందిన ప్రముఖ ఫోటోజర్నలిస్ట్ కార్తీక్ గోన్సాల్వెస్‌ ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు.
 
"ది ఎలిఫెంట్ విష్పరర్స్" మూవీ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఈ యేడాది మొత్తం మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డు కోసం భారతీయ చిత్రాలు పోటీపడుతున్నాయి. వీటిలో ఒకటి "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకుంది. "ఆల్ దట్ బ్రీత్స్" మూవీ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో, "ది ఎలిఫెంట్ విష్పరర్స్" చిత్రం షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఉన్నాయి. 
 
అయితే, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన "ఆల్ దట్ బ్రెత్స్‌"కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో "నావల్నీ" డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ అవార్డు వరించింది. ఆ నిరాశను పటాపంచలు చేస్తూ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో "ది ఎలిఫెంట్ విష్పరర్స్‌"కు అవార్డు అవరించింది. దీంతో ఉప్పొంగిపోయిన కార్తీక్ గాన్‌స్లేవ్స్, గునీత్ మోంగాలు భారతీయ సంప్రదాయ విస్త్రాధరణలో అవార్డును స్వీకరించారు.