శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (22:57 IST)

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. టీమిండియా పరాజయం

team india
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. 272 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
బొటనవేలి గాయంతో చివరిలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వృధా అయ్యింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. 
 
రోహిత్ శర్మ గాయం కారణంగా ఆసుపత్రికి వెళ్లడంతో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలో దిగాడు. అయితే ఐదు పరుగులకే అవుటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 6 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. 
 
అయితే భారత బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు. దీంతో టీమిండియా స్కోర్ 266 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ విజయం ఖరారైంది. 
 
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-0తో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 10వతేదీ జరుగనుంది.