సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (09:08 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : టీమిండియాకు భారీ షాక్!

rohith sharma
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. బుధవారం న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్లు, గురువారం భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. 
 
అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడడు. కుడిచేయికి గాయమైంది. అయితే, గాయం తీవ్రతను మాత్రం వెల్లడించలేదు. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ నిలిపివేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ ఫోటోలు కుడి చేయికి గాయమైనట్టుగా కనిపిస్తుండగా, ఐస్ ప్యాక్‌తో మర్థన చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన నొప్పితోనే బాధపడుతున్నట్టు ఈ ఫోటోలను చూస్తే ఇట్టే గ్రహించవచ్చు. అయితే, ఈ గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ నెల 10వ తేదీన ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత తలపడాల్సివుంది.