ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:37 IST)

రెండేళ్ళుగా కన్నతండ్రే కాటేస్తున్నాడు...

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ అమానవీయ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ పంచాయ

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ అమానవీయ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ పంచాయతీలోని చిన కొవ్వాడలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... చినకొవ్వాడకు చెందిన మైలపల్లి అప్పన్న రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇందుకు కన్నతల్లి మైలపల్లి పోలమ్మ కూడా సహకరిస్తోందని ఇరుగుపొరుగువారి వద్ద వాపోయింది. 
 
ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారంతా కలిసి ఇంటికి వెళ్లి  అప్పన్న, పోలమ్మను నిలదీశారు. అందుకు వీరు అంగీకరించడంతో గ్రామస్తులు అప్పన్నకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తర్వాత అప్పన్న, పోలమ్మ పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.