భానుడి ప్రతాపం: వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో 48 మంది మృతి.. మధ్యాహ్నం వేళల్లో ఎమెర్జెన్సీ
భానుడి ప్రతాపంతో తెలుగు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల్లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణల 28 మంది, ఏపీలో 20 మంది భానుడి ప్రతాపంతో వడదెబ్బ కారణంగా మృ
భానుడి ప్రతాపంతో తెలుగు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల్లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణల 28 మంది, ఏపీలో 20 మంది భానుడి ప్రతాపంతో వడదెబ్బ కారణంగా మృతి చెందారు. నిప్పుల కొలిమిలా గ్రామాలు, పట్టణాలు మారిపోతున్నాయి. వడదెబ్బతో బుధవారం ఒక్కరోజే తెలంగాణలో తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
ప్రతిరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బ కారణంగా కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదుకావడంతో మధ్యాహ్నం వేళల్లో అత్యవసర పరిస్థితి కారణంగా బయటికి రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా రేడియోలు, టీవీల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా వడదెబ్బ నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, 108 సర్వీసులను అందుబాటులోకి ఉంచాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.