టీవీ న్యూస్ రీడర్ స్వప్న.. రెండో వివాహం చేసుకోబోతున్నారా?

Written By సెల్వి
Updated: సోమవారం, 20 జూన్ 2022 (15:07 IST)
Swapna
టీవీ న్యూస్ రీడర్ స్వప్న వివాహం చేసుకోబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన స్వప్న.. ఎఫ్.ఎం.రేడియో ప్రెజెంటర్‌గా వర్క్ చేసింది. అటు తర్వాత దూరదర్శన్‌లో పనిచేసింది. కొంతకాలం తర్వాత టీవీ9లో చేరి బాగా పాపులర్ అయ్యింది. అక్కడ 10 ఏళ్ళ వరకు పని చేసింది. ఆ తర్వాత సాక్షి, 10 టీవీ వంటి వాటిలో కూడా పనిచేసింది.
 
అంతేకాకుండా రాంగోపాల్ వర్మని ఎక్కువగా ఇంటర్వ్యూ చేయడంతో ఈమె యూత్ లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. 'కీ' 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' 'నానీస్ గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాల్లో కూడా చిన్న చిన్న కేమియోలు ఇచ్చింది. 
 
ఇదిలా ఉండగా.. త్వరలో ఈమె ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతుందట. అందుకోసం ఈమె అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
 
కానీ టాక్ మాత్రం బలంగా జరుగుతుంది. ఈమె వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. గతంలో ఈమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. కొన్నాళ్లుగా ఆమె సింగిల్ గానే జీవిస్తూ వస్తుంది. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది మార్ఫింగ్ అంటూ ఆమె స్నేహితులు కొట్టిపారేస్తున్నారు.  

అన్నీ చూడండి

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

తర్వాతి కథనం
Show comments