శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శనివారం, 22 జనవరి 2022 (18:41 IST)

పెట్రోల్ డబ్బా నువ్వు తెచ్చుకుంటావా? మ‌మ్మ‌ల్ని తెమ్మంటావా? మేం రెడీ!

గుడివాడ‌లో మంత్రి కొడాలి నాని క‌ల్యాణ‌మండ‌పంలో క్యాసినో నిర్వ‌హించిన‌ట్లు తాము నిరూపిస్తామ‌ని, మంత్రి కొడాలి నాని చెప్పిన‌ట్లు ఆత‌హ‌త్య చేసుకుంటారా? అని టీడీపీ నాయ‌కులు స‌వాలు చేస్తున్నారు. పెట్రోలు డ‌బ్బా నువ్వు తెచ్చుకుంటావా? మేం తీసుకొస్తాం, తగలబెట్టుకో అని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. 
 
 
నిన్న కేసినో తన కన్వెన్షన్ లో ఆడితే పెట్రోల్ తో తగలబెట్టుకుంటా అని కొడాలి నానీ అన్నాడ‌ని, 
ఇప్పుడు దానికి కౌంటర్ గా బొండా ఉమా స‌వాలు చేశారు. డేట్ టైం నువ్వే ఫిక్స్ చేయి, నీ కన్వెన్షన్ లో ఆడినట్టు మేము ప్రూవ్ చేస్తాం...అన్నారు. మేం ఆరోపణలు ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం, నిరూపించ లేదంటే మేం తగలబెట్టుకుంటాం అని ప్ర‌తి స‌వాలు చేశారు. 
 
 
నిరూపిస్తే నువ్వు తగలబెట్టుకో, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము రెడీ, లేదా మేము ఫిక్స్ చేస్తాం...పెట్రోల్ డబ్బా నువ్వు తెచ్చుకున్నా సరే లేదా మేము తీసుకొస్తాం, తగలబెట్టుకో అని...బోండా ఉమా ఎద్దేవా చేశారు. పారిపోతావా సవాలు వదిలేసి కొడాలి నాని...కేసినో ను నిరూపించడానికి మేం సిద్ధం.. అది కూడా మీడియా ముఖంగా నిరూపిస్తాం... అని పేర్కొన్నారు. 
 
 
దొరికిపోయిన దొంగ కొడాలి నాని అని, ఆరు గంటల్లోనే అమ్మాయిల నృత్యాలను ఆపించాన‌ని నువ్వే ఒప్పుకున్నావు... కేసినోలో డ్యాన్స్ లు వేసి వారి పేర్లు మా దగ్గర ఉన్నాయి. గుడివాడ టిడిపి కార్యాలయంపై దాడి చేసిన వారిలో మట్టా జాన్ విక్టర్ గుడివాడ రూరల్ మండలం వైసీపీ అధ్యక్షుడు, క్యాసినో లో చిందేసిన వ్యక్తి అని బోండా ఉమ పేర్కొన్నారు. దుక్కిపాటి శశిభూషణ్ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇతని ప్రోద్బలంతోనే పక్కా ప్రణాళికతో దాడి జరిగింది. సర్దార్ బేగ్ వైయస్సార్ సిపి నాయకుడు పార్టీ కార్యాలయంలో కుర్చీలు విసిరి కోట్టిన నేత. దమ్ముంటే కొడాలి నాని కేశినో జరగలేదని నిరూపించాలి అని బోండా ఉమ స‌వాలు చేశారు.