అవినీతిపై 14400కి కాల్ చేసిన వర్ల రామయ్య
విజయవాడ : అవినీతిపై ఫిర్యాదులకు ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 14400కి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కాల్ చేశారు. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని టోల్ ఫ్రీ నెంబకు ఫిర్యాదు చేశారు. వైఎస్ హయాంలో తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారం అడ్డంపెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఫిర్యాదు చేశారు. అలాగే జగన్ రాజకీయ అవినీతిపైనా ఐఐఎం అధ్యయనం చేయాలన్నారు.
దీనిపై ఇప్పటికే కళా వెంకట్రావ్ లేఖ రాశారని వర్ల రామయ్య గుర్తు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది సూచించింది. సీఎం ప్రకటించినట్లుగా తన ఫిర్యాదుపై 15రోజుల్లో చర్యలు తీసుకోవాలని, రూ.43వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అభియోగాలు పెట్టుకుని... అవినీతిని అంతమొందిస్తా అని జగన్ ఎలా చెప్తారన్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు.