శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జులై 2019 (18:23 IST)

జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వంశీ భేటీ... సొంతపార్టీలో గుబులు

ఇప్పటికే బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సొంతపార్టీలో గుబులు రేపుతున్న గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... తాజాగా మరో సంచలనం రేపారు. ఈసారి ఏకంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎంను వంశీ కోరారు. ఇప్పటికే సీఎంకు లేఖ రాసిన వంశీ.. తాజాగా ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. 
 
గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించానని, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే విద్యుత్తు సరఫరా ఇచ్చేలా ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు. 
 
వంశీ విజ్ఞప్తిపై జగన్‌ సానుకూలంగా స్పందించారు. అయితే బయటకు టాక్ అలా వస్తున్నా అసలు విషయం మాత్రం అది కాదని మరేదో వుందని వైసీపీ నేతలే చెబుతున్నారు.