ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (09:30 IST)

జగన్‌కు మైండ్ పోయింది.. రోజాకు మేకప్‌లు ఎక్కువయ్యాయి : నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Video)

baireddy sabari
రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కునివుంటే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు వరద రాజకీయాలు చేయడం సిగ్గు చేటని టీడీపీకి చెందిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాజీ సిఎం జగన్‌కు, మాజీ మంత్రి రోజాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 
 
వైసీపీ నాయకులను రాజకీయ నాయకులు అంటారా అని ప్రశ్నించారు. గతంలో వరదలు వచ్చినపుడు మాజీ సిఎం జగన్ హెలికాప్టర్‌లో వెకిలి నవ్వులు నవ్వుకుంటూ చక్కర్లు కొట్టారని అన్నారు. పైగా, వైసీపీ నాయకులు కొద్ది రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవంటూ ప్రచారం చేస్తున్నారని, ఒక్కసారి గత ఐదేళ్ల వైకాపా పాలనను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 
 
ఇపుడు మళ్ళీ విజయవాడ వరదలపై కొత్త నాటకాలు చేస్తున్నారన్నారు. అలాగే, మాజీ మంత్రి రోజాకు ముచ్చుమర్రి ఘటనపై అంత ప్రేమ ఎందుకోనని ప్రశ్నించారు. రోజాకు చెన్నై రాజకీయాల్లో చేరాలని ఉందని, రోజా ఇక్కడ రాజకీయం చేయకుండా చెన్నైలో రాజకీయం చేస్తే బాగుంటుందని తెలిపారు. ముచ్చుమర్రి ఘటన జరిగినప్పుడు నువ్వు ఎందుకు రాలేదని ఎంపీ శబరి ప్రశ్నించారు. మేకప్‌లు వేసుకోనీ ఇంట్లో కూర్చుని మాట్లాడటం తప్ప విజయవాడ బాధితులకు నువ్వు ఏమి చేశావంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి మతిస్థిమితం సరిగా లేనట్లుంది అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనకు లండన్‌లో  ట్రీట్మెంట్ ఇస్తున్నారనీ, లండన్‌లోనే వైసీపీ పార్టీ పెట్టుకుంటే బాగుంటుందన్నారు. సీఎం చంద్రబాబు 24 గంటలు కష్టపడుతున్నారనీ, వైసీపీ నాయకులు చేతనైతే సహాయం చేయండి, అంతేకానీ చిల్లర వ్యవహారాలు, చిల్లర చేష్టలు చేయడం మానేయండి అంటూ హితవు పలికారు.