వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు బుధవారం వైసిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
రెండు, మూడు నెలల నుంచీ ఆయన పార్టీ మారతారనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన అన్న కుమారులు వైసిపిలో చేరారు.
వారం రోజుల క్రితం శిద్దా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలకు ప్రభుత్వం పర్మిట్లు నిలిపివేసింది.
దీంతో మాజీ మంత్రి శిద్దా రాఘవరావుపై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి బాలినేనితో భేటీ అయ్యారని సమాచారం. రాఘవరావును పార్టీలో చేర్చుకునే అంశమై ముఖ్యమంత్రి జగన్ నుంచి గ్రీన్‌సిగల్ వచ్చినట్లు సమాచారం.