మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 23 మే 2018 (12:25 IST)

ఆయన ఇంట వైఎస్సార్ ఫోటో.. కక్ష తీర్చుకున్నారన్న రమణ దీక్షితులు ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగించినప్పటి నుంచి వివాదం రాజుకుంది. తనపై బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఆరోపణల

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగించినప్పటి నుంచి వివాదం రాజుకుంది. తనపై బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 


అమిత్ షా, మోదీలు దగ్గరుండి ఆయనతో మాట్లాడిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేందుకే ఇదంతా చేయిస్తుందని చంద్రబాబు తెలిపారు. 
 
దేశంలోనే నంబర్ వన్ ఆలయంగా ఉన్న టీటీడీని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నదే బీజేపీ అభిమతమని, దాన్ని ఎన్నటికీ జరగనీయబోనని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని, తనను అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో రమణ దీక్షితులుని ఢిల్లీకి పిలిపించుకుని, తనపై లేనిపోని ఆరోపణలు చేయించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 
 
అలాగే రమణ దీక్షితుల ఇంట వేంకటేశ్వర స్వామి ఫోటో పక్కనే దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే.. రమణ దీక్షితులు ఎలాంటి స్వామో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రమణ దీక్షితుల ఆరోపణలపై ఇప్పటికే టీటీడీ అధికారులను వివరణ ఇచ్చారని.. శ్రీవారిని ఎన్నడూ పస్తు పెట్టలేదని అనిల్ సింఘాల్ తనకు చెప్పారని చంద్రబాబు అన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వెంకన్న ఊరుకోబోడని హెచ్చరించారు.
 
ఇకపోతే.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకు వచ్చిన సందర్భంలో వకుళమాత పోటులో నిధుల కోసం ప్రభుత్వం తవ్వకాలు జరిపించిందని చెప్తూ, ఆ ప్రాంతాన్ని, వంటశాలలో చేసిన మార్పులను గురించి ఫిర్యాదు చేసినందుకే.. తనపై కక్షకట్టి ప్రతీకారం తీర్చుకున్నారని తిరుమల మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. పోటులో తవ్వకాలను అమిత్ షాకు చూపించినందుకు తాను బాధితుడిని అయ్యానని చెప్పారు. ఆలయంలో శాస్త్ర విరుద్ధమైన పనులు జరుగుతున్నాయని రమణ దీక్షితులు ఆరోపించారు.