సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (10:16 IST)

చిన్నారి కల్పన అస్తికలను గుర్తించిన పోలీసులు...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హజీపూర్ వరుస హత్యల కేసులో కల్పన అనే చిన్నారి అస్తికలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కల్పన అస్తికలను పోలీసులు సేకరించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ వరుస హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే. నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 
 
ఈ క్రమంలో మనీషా బ్యాగు దొరికిన బావిలోనే కల్పన మృతదేహం ఉండి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు వెతికారు. ఆ బావిలోనే కల్పన మృతదేహం లభించింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కల్పన నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ చిన్నారిని కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు మానవమృగం శ్రీనివాస్‌రెడ్డి తాజాగా పోలీసుల విచారణలో అంగీకరించాడు.