బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 6 సెప్టెంబరు 2018 (14:59 IST)

9 నెలలకు ముందే తెలంగాణ తొలి శాసనసభ రద్దు.. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్

ఎన్నో పోరాటాలు, ఎంతోమంది త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ కథ గడువు కంటే ముందే ముగిసింది. తెలంగాణ చరిత్రలో మరో బిగ్ డే నమోదైంది. ఊహించినట్లే తెలంగాణ అసెంబ్లీ రద్దు అయ్యింది. నాలు

ఎన్నో పోరాటాలు, ఎంతోమంది త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ కథ గడువు కంటే ముందే ముగిసింది. తెలంగాణ చరిత్రలో మరో బిగ్ డే నమోదైంది. ఊహించినట్లే తెలంగాణ అసెంబ్లీ రద్దు అయ్యింది. నాలుగు సంవత్సరాలు, మూడు నెలల నాలుగు రోజులు పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సర్కారు పూర్తికాలం పదవిలో ఉండకుండానే రద్దయ్యింది. 
 
ఉద్యమకాలంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని చేజిక్కించుకున్నాక కూడా అదే స్థాయిలో సెన్సేషనల్‌ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 9నెలల ముందే శాసనసభను రద్దుచేసి తీవ్ర సంచలనానికి తెరలేపింది. 2014 జూన్‌ రెండున అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగగా అదే ఏడాది జూన్‌ 9న తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. 
 
దీని ప్రకారం వచ్చే ఏడాది అంటే 2019 జూన్ 9వరకు నిర్ణీత ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. కానీ అసెంబ్లీ రద్దు కావడంతో తొమ్మిది నెలల ముందే సభ రద్దు కావడంతో తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ కథ నాలుగేళ్ల మూడు నెలల నాలుగు రోజులకే ముగిసింది.
 
ఈ మేరకు అసెంబ్లీ రద్దుపై కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు కేసీఆర్‌ అందించారు. కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు. ఇక.. అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్‌ కార్యాలయం పంపించింది. ఎన్నికలపై  కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంది.