గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (10:55 IST)

ఎన్నికల సిత్రాలు.. ఓటరు కాళ్లు కడిగి.. ఓట్లు అడిగిన అభ్యర్థి...

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రకాలైన ఎన్నికల సిత్రాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, బరిలో ఉన్న అభ్యర్థులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. తాజాగా, పెద్దపల్లి మండలంలోని పెద్ద కల్వల గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచిన కల్వల రమేశ్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. రమేశ్ అతని భార్య వసంతతో కలిసి గ్రామంలోని ఓటర్ల కాళ్లు కడుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
 
మరోవైపు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో భార్యభర్తలు ఇద్దరు సర్పంచ్, ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఉత్కంఠభరింతంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోరులో తెరాస మద్దతుగా పోటీ చేసిన బాషబోయిన శైలజ 171 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. మూడో వార్డులో పోటీ చేసిన ఆమె భర్త బాషబోయిన వీరన్న కూడా గెలుపొందడంతో అతడిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.