సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (09:59 IST)

రాజకీయాల్లో ఇమడలేక పోయిన కైకాల.. రెండేళ్లకే దూరం..

kaikala
తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం వెకువజామున తుదిశ్వాస విడిచారు. అయితే, ఈయన ఒక నటుడుగానే కాకుండా రాజకీయ నేతగా కూడా ఉన్నారు. అయితే, ఎక్కువ కాలం రాజకీయాల్లో ఇమడలేకపోయారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈయన... కేవలం రెండేళ్లకే వాటికి దూరమయ్యారు. 
 
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత 1996 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన పెద రెడ్డయ్యపై దాదాపు 81 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
 
ఆ తర్వాత 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఆయన ఇటు రాజకీయాలు, ఇటు చిత్రపరిశ్రమలోని వివాదాల్లో తలదూర్చకుండా, ప్రతి ఒక్కరికీ ఆజాత శత్రువుగా ఉన్నారు.