శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 28 జూన్ 2021 (21:57 IST)

వర్షం పెళ్ళిని చెడగొట్టింది, పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురు వాన నీటిలో?

ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేము. వాతావరణాన్ని బట్టి వర్షం పడుతుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం వివాహాలు బాగానే జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో బంధువులను పిలిపించుకుని వివాహాలు చేసుకుంటున్నారు. సెకండ్ వేవ్ కరోనాలో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
 
అయితే కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో నిన్న సాయంత్రం ఒక వివాహం జరగాల్సి ఉంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఆధోని, మంత్రాలయం వాగులు వంకలు పొర్లుతున్నాయి. నల్లవంగ వాగు పొంగి పొర్లడంతో ఇంట్లోకి నీళ్ళు వచ్చి చేరాయి.
 
స్థానికులు వర్షపు నీటితో ఇబ్బందులు పడ్డారు. మంత్రాలయంలోని కర్ణాటక గెస్ట్ హౌస్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి మొత్తం నీళ్ళు గెస్ట్ హౌస్ సెల్లార్ లోకి వచ్చేశాయి. కుర్చీలన్నీ మునిగిపోయాయి. చేసిన భోజనం మొత్తం నీటిలోనే మునిగిపోయింది. 
 
దీంతో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుతో పాటు బంధువులు మండపం రెండవ అంతస్తుపైకి ఎక్కి తలదాచుకున్నారట. ఈరోజు ఉదయం అయినా వరదనీరు తగ్గుతుందని అనుకున్నారు. ఉదయం ముహూర్తం కావడంతో నీటి ఉదృతి తగ్గితే పెళ్ళి చేసుకుందామనుకున్నారట. 
 
కానీ నీటి ఉదృతి ఏ మాత్రం తగ్గకపోవడంతో చివరకు వారు పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారట. పెళ్ళికి వచ్చిన బంధువుల బట్టలు, పెళ్ళికి ఇవ్వాల్సిన సామాన్లన్నీ కూడా వరదనీటిలో కొట్టుకుపోయాయట.