శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (11:14 IST)

తిరుమలలో భక్తుల రద్దీ-ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

tirumala
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సర్వదర్శనం టిక్కెట్ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువైన నేపథ్యంలో.. ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
టీటీడీ రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీ చేయలేదు. దీంతో ఇవాళ సర్వదర్శనం టికెట్లను జారీ చేశారు. ఈ టోకెన్ల కోసం తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్ వద్దకు బారులు తీరారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.  
 
ఈ నేపథ్యంలో అధిక రద్దీ కారణంగా భక్తులు నేరుగా తిరుమలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. టోకెన్ల కేంద్రాల వద్ద టోకెన్లు లేకుండానే ఆధార్‌ చూపెట్టి శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చునని తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.