suvichar
✕

తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Written By సెల్వి
Updated: శనివారం, 2 ఏప్రియల్ 2022 (08:53 IST)
ఏపీలోని తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
 
శుక్రవారం రాత్రి ట్రైన్ వెళ్తున్న మార్గంలో కొంత మంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లు పెట్టారు. అయితే.. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచి ట్రైన్ వెళ్లడంతో ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
 
దీంతో అప్రమత్తమైన పైలెట్లు వెంటనే రైలును నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కదిరిగేటు వద్ద అమరావతి ఎక్స్‌ప్రెస్‌ గంటపాటు నిలిచిపోయింది. 
 
ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ట్రైన్‌కు మరో ఇంజిన్‌‌ను జోడించారు. దీంతో రైలు బయలుదేర్దింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అన్నీ చూడండి

Allu Arjun's family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

Varanasi postponed? : వారణాసి ఏరియల్ షాట్ లీక్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, విడుదల వాయిదా .?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రవి కిషన్, నగ్మా లవ్ స్టోరీ

ఊర్వశి రౌతేలాకు తగ్గుతున్న క్రేజ్.. నోరా ఫతేహికి పెరుగుతున్న క్రేజ్

తర్వాతి కథనం
Show comments