ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 18 మార్చి 2021 (17:11 IST)

ద్యావుడా.. తిరుపతి కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చూస్తే నవ్విపోదురు..?

కార్పొరేటర్లంటే బాగా చదువుకున్న వారు.. ఎక్కడా తడబడకుండా మాట్లాడతారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాబట్టి.. ప్రజల్లో ఎప్పుడూ ఉండాల్సిన వాళ్లు. అలాంటి వాళ్లకు ప్రమాణ స్వీకారం చేతకాకుంటే. అదే జరిగింది తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో.
 
ఐదుగురికి పైగా కార్పొరేటర్లు అస్సలు తెలుగు భాషను స్పష్టంగా చెప్పేందుకు నానా తంటాలు పడ్డారు. పదం పదానికి మధ్య గ్యాప్ లేదు.. అస్సలు అర్థమైందో లేదో తెలియని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ప్రమాణ స్వీకర మహోత్సవంలో నవ్వులు పూశాయి.
 
సొంత వైసిపి కార్యకర్తలే గొల్లున నవ్వుకున్నారు. మరీ అక్షరం ముక్కరాని వారు మన కార్పొరేటర్లా అంటూ జనం నోటిపై వేళ్లేసుకునే పరిస్థితి వచ్చింది మరి. అంతేకాదు అక్కడ ప్రమాణ స్వీకారం చేయిస్తున్న కలెక్టర్ హరినారాయణ్ కూడా తెలుగు మాటలు పలికేటపుడు తడబడటం కొసమెరుపు.