సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 8 మార్చి 2021 (20:30 IST)

లాక్‌డౌన్ ఆర్థికంగా చితక్కొడితే, భార్య పరాయి పురుషుడి మోజులో పడి...

భర్త నల్లగా ఉంటాడు, భార్య తెల్లగా అందంగా ఉంటుంది. అయితే ఇద్దరిది లవ్ మేరేజ్. వీరి జంటను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన కలర్ కన్నా తన మనస్సును చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుందని భార్యపై ఎంతో నమ్మకంతో ఉన్నాడు భర్త. అది కాస్త ఎక్కువ రోజులు అతనికి మిగల్లేదు. ఎంతో నమ్మిన భార్యే భర్తను అతి దారుణంగా చంపించింది.
 
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా విక్రవండి ప్రాంతానికి చెందిన లియోపాల్డ్, సుచిత్రా మేరీ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. చెన్నై సిటీకి వచ్చేసిన వీరికి ఇద్దరు పిల్లలు. ఒక బాబుకి ఐదు సంవత్సరాలు, పాపకు మూడు సంవత్సరాలు. 
 
లియో డ్రైవర్. ఐతే కరోనా కారణంగా వీరి కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయింది. చెన్నై సిటీలో బాడుగ కట్టలేక, పిల్లలను పోషించలేక నానా బాధలు పట్టాడు. దీంతో సొంత ఊరికి తీసుకొచ్చి అక్కడ భార్యాపిల్లలను వదిలాడు. 
 
తక్కువ అద్దెకు ఇంటిని బాడుగకు తీసుకుని భార్యాపిల్లలను అందులో ఉంచి తాను చెన్నైకి వెళ్ళాడు. అక్కడ సంపాదిస్తూ ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడు. 15 రోజులకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. పిల్లలను భార్యా బాగా చూసుకుంటుండటంతో లియోకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
 
అయితే వీరి మధ్యలోని రాఖీ అనే యువకుడు వచ్చాడు. సుచిత్రా మేరీ ఉన్న ఇంటికి సమీపంలోనే వీరి ఇల్లు ఉండేది. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టేసుకున్నాడు. ఇది కాస్త నెలరోజులుగా సాగుతోంది. భర్తకు ఏమాత్రం అనుమానం రాకుండా వీరు గుట్టుగా ఆ పని కానిచ్చేస్తున్నారు.
 
అయితే ఉన్నట్లుండి మూడురోజుల క్రితం ఇంటికి వచ్చాడు లియో. పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. భార్య ప్రియుడితో ఇంకో గదిలో రాసలీలల్లో ఉంది. కోపాన్ని దిగమింగుకున్నాడు. ఇద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీనితో భార్యను, ఆమె ప్రియుడిని హెచ్చరించాడు. కుటుంబం పాడైపోతుంది.. ఇంకోసారి ఇలాంటిది వద్దని భార్యకు చెప్పాడు.
 
అయితే భర్తకు విషయం తెలిసిపోవడం.. ప్రియుడితోనే ఉండాలన్న ఆమె ఆలోచన చివరకు భర్తను చంపేయడానికి ప్లాన్ చేసేలా చేసింది. బాధలో ఫుల్లుగా మద్యం సేవించి శనివారం నిద్రిస్తున్న లియోను అతి దారుణంగా చంపేశాడు ప్రియుడు రాఖీ. వారి ఇంటికి సమీపంలో గుంత త్రవ్వి పూడ్చేశారు.
 
అయితే శనివారం, ఆదివారం లియో కోసం వెతికారు బంధువులు. భార్యపైనే అనుమానం రావడంతో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.