శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (16:34 IST)

నలుగురితో లేచిపోయిన యువతి.. లక్కీ డ్రాలో వచ్చిన యువకుడుని పెళ్లాడింది.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తమ గ్రామంలో ఉండే నలుగురు యువకులను ప్రేమించింది. నలుగురు యువకులతో లేచిపోయింది. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి వారిని పట్టుకుని ఓ గృహంలో బంధించారు. అయితే, యువతి కుటుంబ సభ్యులు నలుగురు యువకులపై కేసు పెట్టేందుకు నిర్ణయించారు. కానీ, గ్రామ పంచాయతీ జోక్యంతో నలుగురు యువకుల పేర్లతో లక్కీడిప్ నిర్వహించి, నలుగురిలో ఒకరి పెళ్ళి చేసుకుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని అజీమ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అంబేద్కర్‌ నగరుకు చెందిన ఓ యువతి నలుగురు యువకులను ప్రేమించి వారితో కలిసి లేచిపోయింది. నలుగురు అబ్బాయిల్లోని ఒకరి బంధువు ఇంట్లో యువతిని ఉంచారు. అమ్మాయి ఆచూకీని కుటుంబ సభ్యులు కనుగొన్నారు. దీంతో నలుగురిపై ఫిర్యాదు చేసేందుకు కుటుంబం నిశ్చయించుకుంది. 
 
ఇక్కడే గ్రామ పంచాయతీ రంగప్రవేశం చేసింది. అందరితో ఓ సమావేశం ఏర్పాటు చేసి అబ్బాయిలలో ఒకరిని వివాహం చేసుకోవాలని యువతికి, కుటుంబానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఉంచారు. అమ్మాయి ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటుందని అడుగగా తాను ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతుందో నిర్ణయించుకోలేకపోయింది. దీంతో పంచాయతీ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. 
 
నలుగురు యువకుల పేర్లు వ్రాసి ఓ గిన్నెలో వేశారు. దాని నుండి ఓ కాగితాన్ని తీసుకోవాల్సిందిగా యువతికి సూచించారు. ఈ కాగితంలో పేరు ఉన్న వ్యక్తినే అమ్మాయి వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని ఖరారు చేశారు. సమ్మతి తెలిపిన యువతి చెప్పిన విధంగానే నాలుగు చిట్టీల్లో ఓ కాగితాన్ని తీసి వరుడిని ఎంచుకోగా, అతన్ని గ్రామ పెద్దల సమక్షంలోనే పెళ్లాడింది. 05