ఏపీలో నేడు టెట్ పరీక్షా ఫలితాలు రిలీజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. గత ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ టెట్ పరీక్షల్లో 407329 మంది పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 58.07 శాతం మంది అర్హత సాధించినట్టు తెలిపింది.
అయితే, శుక్రవారం నుంచి అభ్యర్థులు వారి మార్కుల వివరాలను htpps//:cse.ap.gov.in/DSE/ అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీనే ఈ ఫలితాలు విడుదలకావాల్సివుంది. కానీ, పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఫలితాల్లో జాప్యం ఏర్పడింది.
మరోవైపు, 5.25 లక్షల మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అంతమందికి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయలేక విద్యాశాఖ చేతులెత్తేసింది. దీంతో దాదాపు లక్ష మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దూరమయ్యారు.