శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (19:22 IST)

తిరుమలలో పోతులూరి వీరబ్రహ్మం చెప్పినదే జరుగబోతోందా? దీక్షితులు ఏమన్నారు(Video)

తిరుమల శ్రీవారికి అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణం... ఆగస్టు 12 నుంచి 16 వరకూ జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే కార్యక్రమం జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం కల్పించలేమని తొలుత తితిదే ప్రకటించిన సంగతి తెల

తిరుమల శ్రీవారికి అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణం... ఆగస్టు 12 నుంచి 16 వరకూ జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే కార్యక్రమం జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం కల్పించలేమని తొలుత తితిదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో విమర్శలు, వాదనలు వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని భక్తులకు దర్శనం కల్పించాల్సిందేనని ఆదేశించారు. 
 
ఈ మొత్తం వ్యవహారంలో తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడారు. తితిదే బోర్డు శ్రీవారి దర్శనాన్ని నిలుపుదల చేయాలన్న నిర్ణయాన్ని ఖండించారు. బోర్డు చైర్మన్‌కు సంప్రోణం గరించి తెలియదనీ, ఈ కారణంగానే ఈ వివాదం తలెత్తిందని వెల్లడించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానంలో భక్తులకు శ్రీవారి దర్శనం కొన్నాళ్ల పాటు వుండదని తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 
 
అంతేకాదు... ఆ సమయంలో శ్రీవారి నగలు చౌర్యానికి గురవుతాయని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి తితిదే తన నిర్ణయాన్ని మార్చుకుని ఎప్పటిలా భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుందా... అనేది చూడాల్సి వుంది. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడండి.