Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

టీటీడీలో బెదిరింపు లేఖ కలకలం.. పోర్న్‌ లింక్‌ వ్యవహారం.. ఉద్యోగులే ఆ పని చేశారా?

Written By సెల్వి
Updated: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:24 IST)
గతేడాది నవంబరులో ఎస్వీబీసీలో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమ వివరాల కోసం మెయిల్‌ పంపిన వెంకటకృష్ణ అనే భక్తుడికి సమాధానంగా చానెల్‌ ఉద్యోగులు పోర్న్‌ లింక్‌ పంపిన సంగతి తెలిసిందే. ఆ భక్తుడి ఫిర్యాదుతో స్పందించిన టీటీడీ అప్పట్లోనే ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. 
 
ఇటీవల ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురు అధికారులను యాజమాన్యం తొలగించింది. ముగ్గురు అధికారులను ఉద్యోగాల నుంచీ తొలగిస్తూ ఎస్వీబీసీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురూ ఆఫీసులోనే అశ్లీల వెబ్‌సైట్లు చూసేవారని నివేదికలో పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో టీటీడీలో బెదిరింపు లేఖ సంచలనంగా మారింది. ఎస్వీబీసీ ఎండీ, సీఈవోలకు బెదిరింపు లేఖ వచ్చింది. ఇటీవల పోర్న్ లింక్ ఘటనలో తొలగించిన ఉద్యోగుల నుంచే బెదిరింపు లేఖ వచ్చినట్లు ఎస్వీబీసీ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. బెదిరింపు లేఖపై అలిపిరి పోలీసులకు ఎస్వీబీసీ సీఈవో పిర్యాదు చేశారు. ఐదుగురు ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

తర్వాతి కథనం