శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:57 IST)

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి లేనట్టే : తితిదే

కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం వాయిదా వేసినట్లు తితిదే ఆలయ అధికారులు తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరిస్థితులు సాధారణస్థితికి రాగానే ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.
 
కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు పలు మార్గదర్శకాలు, సూచనుల చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా శ్రీవారి దర్శన టిక్కెట్ చేయించుకున్న భక్తులను ముందుగానే కొండపైకి అనుమతించడం కూడా లేదు.