శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:43 IST)

మంత్రాలయం రాఘవేంద్రస్వామికి టీటీడీ శేష వస్త్రం!

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరపున అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి మంగ‌ళ‌వారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.

హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్‌ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి రాఘవేంద్ర స్వామివారికి శ్రీవారి శేష వస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో రాఘవేంద్రస్వామి వారు జన్మించారు. రాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.

మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామివారికి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సుబుదేంద్రతీర్థ స్వామివారు అద‌న‌పు ఈవోను, టీటీడీ బృందాన్ని ఆశీర్వదించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌యం ఒఎస్డీ పాల శేషాద్రి పాల్గొన్నారు.