ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (16:52 IST)

జగన్మాయ.. ఒక వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒక మహిళకు 18 మంది భర్తలు..

tulasi reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన అభ్యర్థులు గెలిచేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం బోగస్ ఓట్లను సృష్టిస్తున్నారు. దాని ఫలితమే ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒకే మహిళకు 18 మంది భర్తలు అని పేర్కొన్నారు. 
 
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి స్పందించారు. కాల మహిమా లేక కలి మాయా లేక జగన్ మాయనా అంటూ కామెంట్స్ చేశారు. ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు, ఒకే మహిళకు 18 మంది భర్తలు ఇలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇది బోగస్ ఓట్ల నమోదు కోసం జరిగిన మాయ అంటూ విమర్శించారు. 
 
దొంగ ఓట్లతో, నోట్ల కట్టలతో అప్రజాస్వామిక పద్ధతిలో బరి తెగించి గెలవాలని వైకాపా భావిస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బోగస్ ఓట్లను సృష్టించడం దురదృష్టకరమని చెప్పారు. దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికలు కూడా సజావుగా సాగేందుకు ఈసీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.