గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (09:23 IST)

రాగిజావను మళ్ళీ వాయిదావేశారు... కారణం తెలీదు!!

ragijava
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే నిమిత్తం ప్రవేశపెట్టిన రాగిజావ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు వాయిదా వేసింది. తొలుత ఈ నెల రెండో తేదీన ప్రారంభించాలని భావించగా, ఆ తర్వాత ఈ నెల పదో తేదీకి వాయిదా వేసింది. ఇపుడు మరోమారు 21వ తేదీకి వాయిదావేసింది. అయితే, ఈ పథకం వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
కాగా, విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. నిజానికి ఈ పథకాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ తర్వాత వాయిదా వేసింది. ఇపుడు కూడా కారణాలు వెల్లడించకపోయినప్పటికీ రెండోసారి కూడా వాయిదా వేసింది. 
 
అదేసమయంలో ఈ రాగిజావను ఏ విధంగా తయారు చేయాలి, అందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి, రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి తదితర వివరాలను బుధవారం ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వాయిదా వేయడం గమనార్హం.