శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (22:56 IST)

విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి.. గోరుచిక్కుడు పొలంలో...

power supply
విద్యుత్ షాక్‌తో ఇద్దరు కలిగిరిలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ, కలిగిరి మండలంలోని కుమ్మర కొండూరు పొలాల్లో 11 కెవి వైరు తగలడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతుడు కంచం రెడ్డి మల్లికార్జున్రెడ్డి గోరుచిక్కుడు పేరు వేసి ఉన్నాడు. గత రెండు రోజుల క్రితం గాలి వేయడంతో తోటలోకి విద్యుత్ సరఫరా అయ్యే వైరు తెగిపోయింది. 
 
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ సహాయంతో విద్యుత్ లైను పునర్ధరించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లిఖార్జున రెడ్డి, నారాయణలు మృతి చెందారు.