గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (20:28 IST)

ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం : యుఎన్ సహాయ కార్యదర్శి త్రిపాధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవని ఐక్యరాజ్యసమితి సహాయ కార్యదర్శి సత్య ఎస్ త్రిపాధి పేర్కొన్నారు. ఈనెల 16,17 తేదీల్లో విజయనగరం జిల్లాలోని వివిధ గిరిజన గ్రామాల్లో పర్యటించి ఆర్గానిక్ ఫార్మిగుకు అక్కడి గిరిజన రైతులు తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర రైతు సాధికార సమితి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్‌తో కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న93 గిరిజన గ్రామాల రైతుల పనితీరును పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించారు.
 
ఆయన పర్యటనలో భాగంగా మంగళవారం అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్‍‌తో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈసదంర్భంగా యుఎన్ సహాయ కార్యదర్శి సత్య ఎస్ త్రిపాధి మాట్లాడుతూ ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపును ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
 
ఈ లక్ష్య సాధనలో ఎపికి తమవంతు తోడ్పాటును అన్ని విధాలా అందిస్తామని యుఎన్ సహాయ కార్యదర్శి సత్య ఎస్ త్రిపాధి చెప్పారు. ఈ భేటీ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. 
 
రానున్న రోజుల్లో హానికారక రసాయనాలు,సింధటిక్ ఎరువుల స్థానే ప్రకృతి సేద్యం పట్ల ఆర్గానిక్ ఫార్మింగ్ మరింత విస్తరింప చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.త్వరలో ప్రకృతి సేద్యంపై రాష్ట్ర స్థాయిలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించడం జరుగుతుందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు.