శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (20:06 IST)

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు నాది.. నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

vizag railway station
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందులోభాగంగా, విశాఖపట్టణంలో రైల్వే భవనాల నిర్మాణం కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రూ.103 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
విశాఖ రైల్వే స్టేషన్ జోన్ భవనాల నిర్మాణం కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. పాత వైర్‌లెస్ కాలనీలో జోన్ కోసం 13 ఎకరాలను భూసేకరణ చేపట్టారు. ఈ భూముల్లో 8 ఎకరాల్లో జోన్ భవాలను, మల్టీ స్టోరీ బిల్డింగుల రూపంలో నిర్మిస్తారు. అలాగే, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునకీకరణ పనుల కోసం రూ.456 కోట్లను కూడా కేంద్రం విడుదల చేసింది. 
 
కేంద్రం విడుదల చేసిన తాజా ప్రకటనతో విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డులో రూ.106 కోట్ల నిధులతో కొత్త రైల్వే జోన్‌కు చెందిన భవనాలను నిర్మించనున్నట్టు కేంద్రం తెలిపింది. తొలి దశలో భాగంగా, పాత వైర్‌లెస్ కాలనీలో 13 ఎకరాల్లో నూత రైల్వే జోన్ కోసం కేంద్రం సేకరించింది. ఇందులో 8 ఎకరాల్లో భవనాలను నిర్మిస్తుంది. అలాగే, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునకీకరణలో భాగంగా అదనంగా మరో రెండు ఫ్లాట్‌పారాలను నిర్మిస్తారు.