మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (15:57 IST)

విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేది.. ప్రధాని

Modi
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ప్రస్తుతం తెలంగాణకు చేరుకున్నారు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రజలను కలవడం సంతోషంగా వుందని మోదీ అన్నారు. విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ.. భారత్‌కు విశాఖ ఎంతో ప్రత్యేక నగరమన్నారు. 
 
విశాఖ ఓడరేవు ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచే రోమ్ వరకు వ్యాపారం జరిగేదని గుర్తు చేశారు. రూ.10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులతో ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. 
 
ఏపీ ప్రజలు మంచి వారని, స్నేహ స్వభావం కలిగిన వారని ప్రధాని ప్రశంసలు గుప్పించారు. ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారని కితాబిచ్చారు. తెలుగు భాష ఉన్నతమైందని పేర్కొన్నారు. 
 
ఇకపోతే, విశాఖలో చేపల రేవును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోందని... సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం భారత్ వైపు చూస్తోందని తెలిపారు.