ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (10:11 IST)

దేశంలో అత్యం కాలుష్య నగరాల జాబితా రిలీజ్.. వైజాగ్‌కు చోటు

polluted cities
దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు నగరాల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి విశాఖపట్టణం కాగా, మరొకటి హైదరాబాద్ నగరం. 
 
అయితే, దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బీహార్ రాష్ట్రంలోని కతిహార్ నగరం మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే, ఏపీలోని విశాఖపట్టణం, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ఓ జాబితాను రిలీజ్ చేసింది. 
 
సీపీసీబీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరాల్లో కతిహార్‌లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోగా, ఢిల్లీ 354, నోయిడాలో 328, ఘజియాబాద్‌లో 302 పాయింట్లతో వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్టణం, హైదరాబాద్ నగరాలు కూడా కాలష్య కోరల్లో చిక్కుకుని ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. విశాఖలోని గాలి నాణ్యత 202 పాయింట్లుగా ఉండగా, హైదరాబాద్ నగరంలో ఇది 100 పాయింట్లుగా ఉంది. ఇక అనంతపురంలో 145, తిరుపతిలో 95, ఏలూరులో 61 పాయింట్ల చొప్పున ఉంది.
 
అదేవిధంగా బీహార్‌లోని బెగుసరాయ్, హర్యానాలోని బల్లాబ్‌గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కూడా కాలుష్య కారక నగరాల జాబితాలో చేరాయి.