'వన్ ఎర్త్ - వన్ ఫ్యామిలీ - వన్ ఫ్యూచర్' : జీ20 లోగో ఆవిష్కరణ  
                                       
                  
				  				   
				   
                  				  "వన్ ఎర్త్ - వన్ ఫ్యామిలీ - వన్ ఫ్యూచర్" పేరుతో జీ20 లోగోను కేంద్రం ఆవష్కరించింది. వచ్చే నెలలో భారత్ జీ20 దేశాల ప్రెసిడెన్సీ (అధ్యక్షత)ని చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని కేంద్రం ఓ లోగోను, థీమ్, వెబ్‌సైట్‌ను రూపొందించగా, దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆవిష్కరించారు. 
				  											
																													
									  
	 
	పైగా, డిసెంబరు ఒకటో తేదీ నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండటం చారిత్రాత్మక ఘట్టమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుంది. ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ స్వీకరించనుంది. 
				  
	 
	జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్‌లో 200 కీలక సమావేశాలు జరుగుతాయి. 32 విభిన్న రంగాలపై భారత్‌లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే యేడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ నేపథ్యంలో జీ20 లోగోను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ, "వసుదైక కుటుంబం" అనేది భారత్ నివాదం అని ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోడీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఆయన పేర్కొన్నారు. పైగా ఈ లోగోపై సూచనలు సలహాలు తెలియజేయాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.